కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలో పీర్ల సావిటి సెంటర్ ముండ్ర సీతయ్య వీధిలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో డ్రైనేజీ నీరు, వర్షపు నీరు రోజుల తరబడి సీసీ రోడ్డు పైన నిలిచిపోవడంతో బురదగా మారి బయటకు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లిన తమ బాధను పట్టించుకోవడం లేదన్నారు. రాత్రి వేళలో వీధిలో నడవాలంటేనే భయంగా ఉందని దోమలు, దుర్వాసనతో జ్వరాలు అనేక వ్యాధులు చుట్టుముట్టి అనారోగ్యం బరిన పడుతున్నామని తమ ఆవేదనను అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు……
మాదాల భూషయ్య……
నల్ల బండ గూడెం గ్రామవాసి…….
వర్షపు నీరు తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. డ్రైనేజీలు లేకపోవడంతో మరుగు నీరు, వర్షపు నీరు కలిసి చాలా రోజులపాటు సిసి రోడ్డు పోయిన నిలిచిపోవడంతో బురదగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి…….
గుంజా స్వరాజ్యం నల్లబండగూడెం గ్రామవాసి…….
రోజుల తరబడి రోడ్డుపైనే వర్షం నీరు చేరడంతో దుర్గంధంతో భరించరని వాసనతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. దోమల వ్యాప్తితో జ్వరాలు, అనారోగ్య సమస్యలతో రోగాల బరిన పడుతున్నాం. ఇప్పటికైనా మా ఆవేదనను అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించండి………..