భారత దేశ శాస్త్ర సాంకేతిక రంగాలకు విశిష్ట సేవలు అందించి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. ఆదివారం కలాం వర్ధంతి సందర్భంగా విజయీభవ ట్రస్ట్, స్వర్ణ భారతి ట్రస్ట్, ఇరుకుళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప శాస్త్రజ్ఞుడు అని రాష్ట్రపతిగా అన్ని వర్గాల ప్రజల మన్ననలను అందుకుని ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలామ్ అని అన్నారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పైడిమర్రి వెంకటనారాయణ, ట్రస్ట్ సభ్యులు చారుగండ్ల రాజశేఖర్, యాదా సుధాకర్, పందిరి సత్యనారాయణ, వెంపటి వెంకటనారాయణ, వెంపటి ప్రసాద్, బండారు శ్రీనివాసరావు, గుడుగుంట్ల సాయి, పత్తి నరేందర్, మహంకాళి సత్యనారాయణ, స్వామి శ్రీనివాసరావు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు……….

previous post
next post