తెలంగాణ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోదాడ పట్టణానికి చెందిన మహమ్మద్ మజాహర్ నియామకం అయ్యారు. ఆదివారం మజాహార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు నియామక పత్రాన్ని అందించారు. మజాహార్ గత పది సంవత్సరాలుగా స్ఫూర్తి యువజన సంఘ అధ్యక్షుడిగా జిల్లా స్థాయిలో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ కోదాడ నియోజకవర్గంలో అనేక సమస్యల మీద పోరాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి చేస్తున్న సేవలకు గాను గుర్తించి జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తనను నియమించిన రాష్ట్ర కమిటీ అనంతుల మధుకు జిల్లా కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కమిటీ చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు……..

previous post
next post