Tnrnews.in
తెలంగాణ

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో తీసిన గుంతలను వెంటనే పూడ్చాలి. కొత్త రోడ్లు వేయాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

సూర్యాపేట టౌన్: సూర్యాపేట మున్సిపాలిటీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో పట్టణంలో కొత్తగా వేసిన రోడ్లను సైతం పగలగొట్టారని ప్రభుత్వం వెంటనే కొత్త రోడ్లు వేయాలని సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పోరుబాట లో భాగంగా పట్టణంలోని 9వ వార్డులో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో కొత్తగా వేసిన రోడ్లన్నీ సైతం వదలకుండా ఇస్తానుసారం రోడ్లను పగలగొట్టి పైపులు వేసిన గుప్తాదారులు దానిపై కొత్త రోడ్డు వేయకుండా వెళ్లిపోయారని అన్నారు. తక్షణమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో పగలగొట్టిన రోడ్లను పునర్నిర్మాణం చేయాలన్నారు. 9వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ప్రభుత్వం అర్హులైన వారందరికీ పింఛన్ మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు గండమల్ల భాగ్యమ్మ, శశిరేఖ, సైదమ్మ, ఎల్లమ్మ, పిట్టలరాణి, పద్మ, వెంకటమ్మ, మారయ్య పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విబిజిరామ్ జి బిల్లును వెంటనే రద్దు చేయాలి.  పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాబా ప్రతి పాధకన ప్రకారం ఓసిలకు ప్రత్యేకంగా స్థానాలు కేటాయించి ఆయా స్థానాలలో కేవలం ఓసి లు మాత్రమే పోటీ చేసేలా చట్టం తేవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా విన్నవించిన. సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ.    

TNR NEWS

కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో అబుల్ కలాం జయంతి………  మౌలానా అబుల్ కలాం జీవితం ఆదర్శం……..  రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎం ఏ జబ్బార్……….

TNR NEWS

గుడుంబా ఇస్తావారాలపై పోలీసుల దాడులు… 150 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం,ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం:  ఈస్గాం ఎస్ఐ ‌మహేందర్ఆధ్వర్యంలో..

TNR NEWS

రణపంగ శ్రవణ్ పూలేకు గౌరవ డాక్టరేట్* *నేటి సామాన్యుడికి దక్కిన అరుదైన గౌరవం* *ప్రజా సమస్య పైన వివిధ సామాజిక కార్యక్రమాలకు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం.*  *లయన్ డాక్టర్ ఆకుల రమేష్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం* *ఈ గౌరవం నా ఒక్కడిది కాదు… నన్ను నమ్మిన ప్రతి ఒక్కరి విజయం*  *ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది రణపంగ శ్రవణ్ పూలే

TNR NEWS

TNR NEWS