Tnrnews.in
తెలంగాణ

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిలసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని,పిల్లలు చెడు వ్యసనాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో మండల ప్రజలకు సూచించారు.యువత సరైన దారిలో నడిచేలా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని, వారు ఏం పనులు చేస్తున్నారో ఓ కంట కనిపెడుతుండాలని సూచించారు.ఖాళీగా తిరగడం వలన వారి ఆలోచనలు చెడు వ్యసనాలపై పడే అవకాశాలు ఉంటాయని అటువంటి సమయంలో బాధ్యతను పెంచే ఆలోచనలపై దృష్టి మరల్చేలా చేయాలని అన్నారు.గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత చెడు మార్గాల వైపు వెళ్లకూడదని అన్నారు. ముఖ్యంగా గంజాయి,మత్తు పదార్థాలు, డ్రగ్స్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌కు అలవాటుపడితే కుటుంబాలు వీధిన పడుతాయని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉండటమే కాకుండా.. వారికి సాధ్యమైనంత వరకు ఫోన్‌ ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తెలంగాణాలో సూర్యుడు భగ.. భగ..

TNR NEWS

మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు

TNR NEWS

అమ్మానాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడాకారులకు రెండు బహుమతులు అందజేత

TNR NEWS

రైతన్నలకు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి

TNR NEWS

గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

Harish Hs

ఆయిల్ పామ్ సాగు చేసి అధిక ఆదాయం పొందాలి  రైతులు నిపుణుల సూచనలు పాటించాలి  జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ 

TNR NEWS