ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆరోగ్యశాఖ సంయుక్తంగా,చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన గంటలోగా ఇచ్చే పాలను ముర్రుపాలు అని ఈ పాలు బిడ్డకు మొదటి టీకాగా ఉపయోగపడుతుందని దీని ద్వారా వ్యాధి నిరోధక శక్తి ఏర్పడుతుందని తెలిపారు. తల్లులు ఎటువంటి అపోహలు లేకుండా ముర్రుపాలను అందించాలని ఈ విధంగా బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ సునీత అంగన్వాడీ టీచర్లు ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు
