May 19, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తెలంగాణ చదువుల్లో మార్పులు రావాలి

తెలంగాణ చదువుల్లో మార్పులు రావాలని తెలంగాణ పౌర స్పందన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.సోమవారం తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో విద్యా వైద్యం ప్రభుత్వ బాధ్యత అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రచార జాత కోదాడకు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు… తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్య తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. ప్రభుత్వం సమూలమైన మార్పులతో తగు చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ బడులు నిలబడతాయి అన్నారు.ప్రభుత్వ బడులు నిలబడాలంటే చదువుల్లో అంతరాలు పోవాలని ఉన్నోడి పిల్లలైనా లేనోడి పిల్లలైనా ఒకే బడిలో చదవాలన్నారు. అంతరాలు లేని చదువుకై అందరూ మాట్లాడాలని పిలుపునిచ్చారు.పౌర స్పందన వేదిక ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణకు కృషి చేస్తుందని అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జాత ద్వారా ప్రజలకు చైతన్యం కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు ఇందులో భాగంగా నేడు నల్గొండ నుండి బయలుదేరిన యాత్ర నకిరేకల్, సూర్యాపేట కోదాడ డివిజన్లకు చేరిందన్నారు.ఈ కార్యక్రమంలో పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కే ఏ మంగ జిల్లా అధ్యక్షులు ఆర్ ధనమూర్తి ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, కోదాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్ర సుధారాణి , జిల్లా ప్రధాన కార్యదర్శి వి వెంకటరమణ,టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శులు,ఎన్ నాగేశ్వరరావు,పాండురంగ చారి,జిల్లా టీఎస్ యుటిఎఫ్ డివిజన్ బాధ్యులు ఆంజనేయులు బాబు వెంకటేశ్వర్ రెడ్డి బచ్చయ్య మోతిలాల్ ఖాజామీయా మైసయ్య సైదిరెడ్డి,నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు……

Related posts

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి

TNR NEWS

ఈనెల 21, 22న దివ్యాంగులకు ఆటల పోటీలు: కె.వి. కృష్ణవేణి

TNR NEWS

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

TNR NEWS

తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ !

TNR NEWS

గ్రామశాఖ అధ్యక్షులకు నియమాక పత్రాలు అందజేస్తున్న ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ

Harish Hs

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ జయంతి

TNR NEWS