తమ విద్యార్థి జీవితంలో విద్యార్థులు రియల్ హీరోలైన తల్లిదండ్రులు, టీచర్లు, దేశ క్షేమం కోసం కృషి చేసే సైనికులు, రైతులను ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ కాలేజీ లో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ , పేరెంట్స్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవ జీవితంలోనే విద్య తోనే ఉన్నత స్థానాలు, మర్యాద, గౌరవం లభిస్తాయన్నారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ నుండి 6 సంవత్సరాల పాటు కష్టపడితే వారి జీవిత గమనం సాఫీగా సాగుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులు ఆకర్షణలకు లోను కాకుండా, ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు కష్టపడాలని కోరారు. తమ పిల్లల బాగు కోసం తల్లిదండ్రులు కష్టపడతారని, వారి కష్టాన్ని గమనించి భవిష్యత్తులో వారికి కష్టాలు లేకుండా పిల్లలు చదువుకోవాలన్నారు. విద్యార్థులు కస్టపడి కాకుండా ఇష్టపడి చదువున్నప్పుడే వారు మంచి ఫలితాలు సాధిస్తారని, విద్యార్థులు చదువును భారంగా కాకుండా ఇష్టంగా మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి మాట్లాడుతూ తమ కాలేజీ లో విద్యార్థులకు చదువు పై ఇష్టాన్ని పెంచే విధంగా విద్యా బోధన చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కాలేజీలో నిర్వహించిన పరీక్షలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల్, వైస్ ప్రిన్సిపాల్ జీ. వీ, అకడమిక్ డైరెక్టర్ మైనం రామయ్య, పలువురు అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

previous post