మల్యాల మండలం మ్యాడంపెళ్లి గ్రామం నందు మట్టి ఆరోగ్య పత్రం (ఎస్ హెచ్ సి) పథకం కింద మట్టి నమూనాలు సేకరించడానికి రైతులతో సమావేశము ఏర్పాటు చేసినట్లు A. మంజుల వ్యవసాయ విస్తరణ అధికారిని తెలిపారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ప్రతి ఐదు ఎకరాలకు ఒక మట్టి నమూనా తీసుకోవడం జరుగుతుందని, ఈ మట్టి నమూనాను ఎం ఎస్ టి ఎల్, హైదరాబాదు ల్యాబ్ నకు పంపడం జరుగుతుందన్నారు. ఈ మట్టి పరీక్ష చేయించడం వల్ల రైతుల పొలాల్లో నత్రజని, భాస్వరం పొటాషియం మరియు 16 రకాల సూక్ష్మ పోషకాలు ఎంత మోతాదు లో ఉన్నవి తెలుస్తుందన్నారు. కావున రైతులు తమ విధిగా తమ పొలం నందు మట్టి నమూనాను సేకరించడానికి సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ,గ్రామ రైతులు పాల్గొన్నారు.