విద్యార్థులకు విద్యతోపాటు నైతిక విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుశీల భాయీ పట్టణ మహిళా ప్రముఖులు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యతను గుర్తించి వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశ నలుమూలల నుంచి వివిధ హోదాలలో సేవలందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం కేంద్ర ప్రభుత్వం చేత మంజూరైన నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ పథకానికి ఎంపికైన 9వ క్లాస్ విద్యార్థిని భావనకు 12 వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమీల, బంగారు నాగమణి, రిటైర్డ్ హెచ్ఎం ముత్తవరపు రామారావు, పుణ్యవతి స్వరూప,పార్వతి,అరుణ తదితరులు పాల్గొన్నారు…………