కోదాడ పట్టణంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని రిశ్విని ఖమ్మంలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలు అండర్ 12 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. కాగా ఈరోజు పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థినిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో పథకాలు సాధించి చదువుతోపాటు క్రీడల్లోను రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ గోవర్ధన్, ఉపాధ్యాయులు కన్నయ్య, రాయుడు, నాంచారయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు………..

previous post