సూర్యాపేట: ఈనెల 26న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దురాజ్ పల్లి లింగమంతుల స్వామి దేవస్థాన కమ్యూనిటీ హాల్ లో జరిగే గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా మూడవ మహాసభ ను జయప్రదం చేయాలని జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి అన్నారు. బుధవారం వి.ఎన్ భవన్ లో గొర్రెల, మేకల పెంపకం దార్ల సంఘం జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు రెండో విడత గొర్రెల పంపిణీ నగదు బదిలీ చేయాలని కోరారు.పశు వైద్యశాలలో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. గొర్రెల మేకల పెంపకం దారుల సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొర్రెలు,మేకల పశుగ్రాసం కోసం ప్రతి గ్రామం సొసైటీకి 10 ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన గొల్ల, కురుమలకు వృద్ధాప్య పెన్షన్ అందించాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన గొల్ల కురుమలకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. పెంపకం దారులు ఐక్యతగా ఉంటూ అన్ని రంగాలలో రాణించాలని, త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకం దారుల సూర్యాపేటజిల్లా జిల్లా గౌరవ అధ్యక్షులు మట్టిపల్లి సైదులు, ఉపాధ్యక్షుడు కంచు కోట్ల శ్రీనివాస్,రాజుల నాగరాజు, జిల్లా నాయకులు వేల్పుల వెంకన్న, గుండాల శివ పాల్గొన్నారు.