ఇంటి ప్రవేశం లో గోడ కట్టి కుటుంబాన్ని ఐదు నెలల నుండి తమ ఇంటి లోకి పోనీయకుండా వేదిస్తున్న అవమానననీయ ఘటన అనంతగిరి మండలం పాత గోల్ తండా గ్రామము లో జరుగుతున్నది.భాధిత కుటుంబ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన భాదితుడు బోడ శంకర్ కుటుంబం 40 సంవత్సరాల నుండి ఇంటి నంబర్1-50 లో నివసిస్తున్నాడు.అతని ఇంటి ముందు గ్రామపంచాయతీ రోడ్డు కు, ఇంటి ప్రవేశద్వారం మధ్య ఇంటి పక్కనే నివసిస్తున్న నునావత్ కాంతి కుటుంబం గోడ కట్టి,కర్ర మొద్దులను అడ్డుగా పెట్టి ఇంటి నుండి బయటకు రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇంటికి దక్షిణం వైపు ఉన్న ఇంటి వారిని బతిమిలాడి ఆ ఇంటి గుండా రాకపోకలు కొనసాగిస్తున్నామని తెలిపారు. గత ఐదు నెలలుగా ఇంటి నుండి బయటికి వెళ్లకుండా, బయట నుండి ఇంటికి వెళ్లకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని, కనీసం త్రాగటానికి, వాడుకోవటానికి వచ్చే నీటి పైపులను సైతం ధ్వంసం చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గోడ కట్టిన స్థలం వారిది అన్నట్లు ఎటువంటి ఆధారాలు లేకపోయినా 40 సంవత్సరాలుగా లేనిది,ఈ ఐదు నెలల నుంచి తమను కావాలని కొందరు మండల నాయకులతో కలసి వేధింపులకు,దౌర్జన్యాలకు గురి చేస్తున్నారని దీనిపై కోదాడ ఎమ్మెల్యే కు,గ్రీవెన్స్ లో కలెక్టర్ కు,పోలీసులకు,మండల గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని భాదిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా ఉన్నత అధికారులు కలుగజేసుకొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని,లేనిచో బలవర్మనానికి తమ కుటుంబం సిద్ధపడుతామని దానికి నాయకులు,అధికారులు బాధ్యత వహించాలని తమ ఆవేదనను వెలిబుచ్చారు.