తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డు అసోసియేషన్ ఆదేశాల మేరకు సూర్యాపేట డిస్టిక్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24న జిల్లా కేంద్రంలో జరగబోయే సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న కరాటే మాస్టర్స్ అంతా హాజరై జయప్రదం చేయాలని అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సయ్యద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇట్టి సమావేశం స్థానిక నిర్మల హాస్పిటల్ రోడ్డులో గల జెకెఏడబ్ల్యూఎఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయం నందు మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ నుంచి అబ్జర్వర్లు హాజరు కానున్నట్లు వెల్లడించారు.మరిన్ని వివరాలకై 91103 63889 నెంబర్ ను సంప్రదించ వల్సినదిగా ఆయన కోరారు.
previous post