Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

షీ టీమ్స్,సైబర్ నేరాలపై అవగాహన

*ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కోదాడ DSP శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని త్రివేణి డిగ్రీ కళాశాల లో షీ టీమ్స్, సైబర్ నేరాలపైన విద్యార్థిని, విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.* ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* *ATM* *కార్డ్ వివరాలు,* *OTP* *వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.* *సైబర్ మోసాలపై* *1930* *టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే *కాలేజి లో హాస్టళ్లు మహిళలపై వేధింపులు జరిగితే షీ టీం వాట్సాప్ నెంబర్*8712686056* *కు* *సమాచారం ఇవ్వాలని తెలిపినారు.* *”టీ సేఫ్” యాప్ పై మహిళలు అవగాహన కలిగియుండాలని అన్నారు* 

*వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు*  

            

*యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. *సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన* *పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు. 

 

 *ఈ కార్యక్రమం నందు త్రివేణీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్,షీ టీమ్ కానిస్టేబుల్ నాగేంద్రబాబు, మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.*

Related posts

దివ్యాంగుల అనాధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం అందజేత

Harish Hs

గుడుంబా ఇస్తావారాలపై పోలీసుల దాడులు… 150 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం,ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం:  ఈస్గాం ఎస్ఐ ‌మహేందర్ఆధ్వర్యంలో..

TNR NEWS

బర్డ్ వాక్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించిన అటవీ శాఖ అధికారులు…  వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పక్షి ప్రేమిక పర్యా టకులు…

TNR NEWS

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

Harish Hs

సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

Harish Hs

*రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS