ఫిబ్రవరి రెండవ తేదీన సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు మా శెట్టి అనంతరాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025- 26 సంవత్సరానికి గానుఆర్యవైశ్య సంఘం జిల్లా ఎన్నిక ఫిబ్రవరి రెండవ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి కోదాడ డివిజన్ కు చెందిన కోదాడ పట్టణం, కోదాడ మండలం, అనంతగిరి, నడిగూడెం, మునగాల, చిలుకూరు మండలాలకు చెందిన వారు మాత్రమే నామినేషన్లను దాఖలు చేయవలసి ఉంటుందన్నారు. ఈనెల 27న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం లో నామినేషన్లను దాఖలు చేయాలన్నారు పోటీ చేసేవారు వ్యక్తిగతంగా నామినేషన్ ఫారం ను తీసుకొని నింపి దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. అదే రోజున దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు……