Tnrnews.in
తెలంగాణరాజకీయం

గుడుంబా ఇస్తావారాలపై పోలీసుల దాడులు… 150 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం,ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం:  ఈస్గాం ఎస్ఐ ‌మహేందర్ఆధ్వర్యంలో..

 కాగజ్‌నగర్‌ మండలం ఈస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని నజురుల్ నగర్ విలేజ్ నెంబర్ 5 గ్రామ శివారులో గుడుంబా తయారు చేస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ఉదయం గుడుంబా స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో తుంగమడుగు గ్రామానికి చెందిన మహేష్(30) తండ్రి సుధాకర్, కులం: యాదవ, వృత్తి కూలీ, అను వ్యక్తి విలేజ్ నెంబర్ 5 గ్రామానికి శివారులో గుడుంబా తయారు చేస్తూ పట్టుబడ్డాడు. ఈ దాడిలో 150 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామన్నారు. అలాగే 5 లీటర్ల గుడుంబాను స్వాధీన పరుచుకుని అతనిపై తెలంగాణ ప్రొహిబీషన్ ఆక్ట్ సి.ఆర్ నెంబర్ 07/24యు /ఎస్ 7(ఎ )ర్ /డబ్లు 8(ఈ ) ప్రకారం కేసు చేసినట్లు ఎస్ఐ మహేందర్ వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గుడుంబా తయారుచేసిన విక్రయించిన అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఈ దాడులలో ఎస్సై మహేందర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా చెస్ ఛాంపియన్ మేకల అభినవ్ జయంతి

Harish Hs

సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

TNR NEWS

భీమా రంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించండి

Harish Hs

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిల్లుట్ల శ్రీనివాస్ నియామకం…. గతంలో కోదాడ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన పిల్లుట్ల శ్రీనివాస్…..

TNR NEWS