పిఠాపురం : కాకినాడ జిల్లా నూతన బాక్సింగ్ అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం పిఠాపురం ఆర్.ఆర్.బిహెచ్.ఆర్.ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సర్వ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులందరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్రకుమార్ ని సభ్యులందరూ ఏకగ్రీకంగా ఎన్నుకున్నారు. నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ బాక్సింగ్ క్రీడాకారుల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాల అందిస్తాను అని అన్నారు. అనంతరం సభ్యులందరూ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేంద్ర కుమార్ ను శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సెక్రెటరీ రజిని, సభ్యులు కె.చిన్నబ్బాయి, జె.ప్రసాదరావు, పి.లక్ష్మణరావు, గణేష్, కృష్ణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.