కోదాడ మండల పరిధిలోని అశోక్ నగర్ లో గల శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో కోదాడ పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కడారు రామకృష్ణ వారి తండ్రి కడారు పెద్ద పాపయ్య మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం పేద అనాధ పిల్లలకు అన్నదానం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ప్రతి ఒక్కరూ వేడుకల పేరిట డబ్బు వృధా చేయకుండా పేద పిల్లలకు సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. భవిష్యత్తులో కూడా శనగల రాధాకృష్ణ అనాధ ఆశ్రమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడారు వెంకటమ్మ, ధనలక్ష్మి, మోక్షిత, చంద్ర ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు……….

previous post