వైద్య శాఖలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు గత రెండేళ్ల క్రితం లెప్రసి,పల్స్ పోలియో ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ,వాటిని చెల్లించిన పిదపనే కొత్త సర్వేలను చేయించాలని సీఐటీయూ జగిత్యాల జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ సీఐటీయూ జిల్లా కన్వీనర్ సులోచన ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న ఆశాలు పెద్ద ఎత్తున చేరుకుని జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం నిరసన చేపట్టారు.
కలెక్టరేట్ లోకి వెళ్లి సంబంధిత అధికారి కి సమస్యలతో కూడిన వినతిపత్రం ఇద్దామన్న
ఆశాలను లోనికి వెళ్ళనియకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు.
ప్రభుత్వ0 మా సమస్యలను తీర్చడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆశాలు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సులోచన మాట్లాడుతూ ఆశాల సర్వే డబ్బుల విషయంలో మా నాయకులు కమిషనర్ కార్యాలయం అధికారులు డబ్బులు విడుదల చేశామని చెబుతు ప్రొసీడింగ్ ఆర్డర్ చుపెట్టారని జిల్లా అధికారులను అడిగితే మాకు రాలేదని నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని ఆరోపించారు.ప్రోసిండింగ్ ఆర్డర్ ఉంటే డబ్బులు రాలేదని జిల్లా అధికారులు సమాధానం చెబుతున్నారని
ప్రభుత్వ అధికారులు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని సులోచన మండిపడ్డారు.
బకాయిలు చెల్లించకుండా మళ్ళీ డిసెంబర్ 2 నుండి మళ్ళీ లెప్రసి సర్వేలు చేయమనడం సమంజసం కాదన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించి పిదపనే కొత్త సర్వేలు చేస్తారని, ప్రభుత్వం ఈ విషయంలో ఆశాలకు న్యాయం చేయాలని ఇందూరి సులోచన కోరారు.
అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కి ఆశాలు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు మమత, సుజాత, లావణ్య,పద్మ, స్వప్న, రజిత, స్వప్న,విజయ, జమున, రూప, యశోద, లక్ష్మీ, అనూష,జ్యోతి, సుశీల, భాగ్య,భాగ్యలక్ష్మి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.