ప్రభుత్వం మంజూరు చేసిన అగ్రికల్చర్ కాలేజ్ ని కోదాడ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సోషల్ వర్కర్ గంధం సైదులు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు శ్రీ ఉత్తంకుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే నల్లమాద పద్మావతి రెడ్డి గార్లను ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. నియోజకవర్గంలోని మునగాల, నడిగూడెం మండలాల్లోని 190 సర్వే నెంబర్ భూముల్లో ఏర్పాటు చేస్తే జాతీయ రహదారికి దగ్గరగా ఉండి విద్యార్థుల రాకపోకలకు అనువుగా ఉంటుందన్నారు. ముకుందాపురం నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉన్న 190 సర్వే నెంబర్ లో ఏర్పాటు చేస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుంది అన్నారు. లేనిపక్షంలో ఇదే నియోజకవర్గంలోని చిలుకూరు మండల కేంద్రం సమీపంలో బేతవోలు వెళ్లే రహదారి లో గల గుట్ట దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ విషయమై రాష్ట్ర నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు పునరాలోచించి ఆఫీసర్ లతో చర్చించి ప్రజలకు అనుగుణంగా ఉండే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

previous post