ఒత్తిడి నుంచి బయటపడేందుకు,మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కే సురేష్,అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎండి ఉమర్ లు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కోదాడ బర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షటిల్ క్రీడా పోటీలను వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. క్రీడలు ఐకమత్యం,స్నేహభావం పెంపొందించడంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు న్యాయవాదులు, సిబ్బంది క్రీడా పోటీల్లో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఉయ్యాల నరసయ్య, సెక్రటరీ రామకృష్ణ, గేమ్స్ సెక్రటరీ రమేష్ బాబు, న్యాయవాదులు గట్ల. నరసింహారావు, శరత్ బాబు, కోదండపాణి, రహీం, చలం, సీతారామరాజు, పాషా తదితరులు పాల్గొన్నారు…………….

previous post