పిఠాపురం : కులాలకు, మతాలకు, జాతులకు అతీతంగా జరుపుకునే పండుగ ఆగష్టు 15 అని అన్నారు. ఎటువంటి భ్రాంతికిలోను కాకుండా విద్యాభ్యాసం చేసి, ఉన్నత పదవులను అలంకరించి, మీ కుటుంబానికి, మీ టీచర్ లకు, మన దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకునిరావాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా అన్నారు. జన్మనిచ్చిన తల్లి తండ్రులు, విద్య నేర్పు గురువులను ప్రత్యక్ష దైవంగా భావించాలని అన్నారు డా ఉమర్ ఆలీషా. పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. హై స్కూల్, ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. జూనియర్ కళాశాల ఆవరణలో పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, స్కూల్ హెడ్ మాస్టర్ రామ కృష్జ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కేశవరావు, టి.డి.పి. కౌన్సిలర్స్ రాయుడు శ్రీనుబాబు, అల్లవరపు నగేశ్, తదితరులు పాల్గొన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా జూనియర్ కళాశాల విద్యార్థులు 8 మందికి రూ.15 వేలు నగదు పారితోషికంగా అందజేశారు. స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో సుమారు 200 మొక్కలు పంపిణీ చేసి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని డా ఉమర్ ఆలీషా పిలుపునిచ్చారు. జూనియర్ కళాశాల ఆవరణలో పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా మరియు మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్స్, అధ్యాపకులు, సిబ్బంది, పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా గారి సోదరులు మెహబూబ్ పాషా, అహమద్ ఆలీషా, కబీర్ షా కూడా పాల్గొన్నారు.

previous post