పిఠాపురం : పట్టణంలోని ఆర్యవైశ్యులు పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని ఆర్యవైశ్యులు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు గల మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆలయం వేదికగా జెండా వందనం కార్యక్రమాలు నిర్వహించి జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఈ కార్యక్రమానికి వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి దేవాలయం అధ్యక్షులు దంగేటి సత్యనారాయణ మూర్తి, ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు వెలగా వెంకటనగేష్, ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా జోన్ చైర్పర్సన్ ఇమ్మిడిశెట్టి నాగేంద్రకుమార్, కాకినాడ జిల్లా డిస్ట్రిక్ట్ కన్వీనర్ బోడ సతీష్, పిఠాపురం మండల్ ఆర్య వైశ్య అధ్యక్షుడు రేపాక రమేష్, చక్క శోభనాద్రి, కప్పల సత్యనారాయణ, బాదం రామయ్య, కర్ణాటక తాతాజీ, మానేపల్లి చైతన్య, కంచర్ల నగేష్, పైండా రాజా, కొత్త దేవ జగన్మోహన్ గుప్తా, కడించర్ల శంకర్ మరియు పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం ఇతర సభ్యులు యావన్మంది ఆర్యవైశ్యులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.