సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న మార్వాడి షాప్ లను తనిఖీ చేయాలంటూ కోదాడ పట్టణానికి చెందిన అభ్యుదయ యూత్ అధ్యక్షులు తోటపల్లి నాగరాజు కంప్లైంట్ లెటర్ ను ఏ సి టి ఓ సంధ్యకు అందజేశారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు తోటపల్లి నాగరాజు మాట్లాడుతూ… ఈనెల 16వ తారీఖున కూరగాయల మార్కెట్ వెనుక మహదేవ్ బ్యాంగిల్స్ షాప్ నందు తమ కుటుంబ సభ్యులతో దుస్తులు కొనుగోలు చేశామని అవి ఇంటికెళ్లి చూసుకొనగా నాణ్యత లేకుండా ఉన్నాయని తిరిగి షాప్ యజమానికి ఇవ్వగా అతను నిరాకరించాడని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే తమకు ఎటువంటి జిఎస్టి నెంబర్లు లేనటువంటి జీరో బిల్లుని తమకు అంటగట్టాడంటూ ఈ సందర్భంగా తెలిపారు. కోదాడ పట్టణ వ్యాప్తంగా ఉన్న వివిధ మార్వాడి మరియు రాజస్థాన్ షాపుల నందు తనిఖీ చేసి నకిలీ వస్తువులను గుర్తించాలని అలాగే జీరో బిల్లులను ప్రజల అంటగడుతున్న వారిపై చర్యలు కూడా తీసుకోవాలాంటు ఈ సందర్భంగా అభ్యుదయ యూత్ అధ్యక్షులు నాగరాజు తెలిపారు.
