కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు చేరేలా సోషల్ మీడియా వారియర్స్ కృషి చేయాలని,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని కాశీనాధం ఫంక్షన్ హాల్ లో జరిగిన సోషల్ మీడియా వారియర్స్ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నియోజకవర్గస్థాయి సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.. పోస్టులు,రీల్స్, బ్రాడ్ కాస్టింగ్ గ్రూపుల ద్వారా ఆకర్షణీయమైన కంటెంట్ ను ప్రజలకు చేరవేయాలని ఆయన సోషల్ మీడియా వారియర్స్ కు సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సోషల్ మీడియా వారియర్స్ కు సూచించారు.