గొల్లప్రోలు : గొల్లప్రోలులోని జగన్ కాలనీకి మళ్ళీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కాలనీ రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండడంతో గత పది రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. సుద్ధ గడ్డ వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటినా నీటి ప్రవాహానికి రహదారి కోతకు గురి కావడంతో రాకపోకలు జరగలేదు. శనివారం నీరు పూర్తిగా తగ్గడంతో అధికారులు రహదారిపై గ్రావెల్ వేసి మరమ్మతులు చేపట్టారు. దీంతో సాయంత్రం నుండి కాలనీవాసులు రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే గొల్లప్రోలు – తాటిపర్తి రహదారిపై ప్రవహిస్తున్న నీరు కూడా పూర్తిగా తొలగిపోవడంతో 12 రోజుల అనంతరం ఈ రహదారి గుండా రాకపోకలు జరుగుతున్నాయి.