Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్రాజకీయం

అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి

  • మంత్రి నాదెండ్ల మనోహర్ కు గౌరీ నాయుడు వినతి పత్రం

 

 పిఠాపురం : పిఠాపురం పట్టణానికి చెందిన యువ సాహితీవేత్త, రచయిత, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ  అతిథి అధ్యాపక సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్ కిలారి గౌరీ నాయుడు కాకినాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో  మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను బోధిస్తూ విద్యారంగ అభివృద్ధికి విశేష సేవలను అందిస్తున్న అతిథి అధ్యాపకుల సమస్యలపై డాక్టర్ గౌరీ నాయుడు మంత్రితో చర్చించారు. ఒక కళాశాలలో పర్మినెంట్ అధ్యాపకుల బదిలీలు జరిగినప్పుడు అతిధి అధ్యాపకులను పోస్టు ఖాళీగా ఉన్న డిగ్రీ కళాశాలకు పంపించేలాగ విద్యాశాఖ జీవో జారీ చేసేలాగ కూటమి ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నెలవారి ఇచ్చే జీతం గంటల చొప్పున కాకుండా సంవత్సరంలో 12 నెలలు కన్సాలిడేటెడ్ జీతం ప్రభుత్వం ఇచ్చేలాగ ప్రభుత్వం తరపున సహకారాన్ని అందించాలని విన్నవించారు. గత సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ  అతిథి అధ్యాపకుల సంఘం నాయకులు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్. ఎన్.వర్మ, పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలో కలిసినప్పుడు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న అతిథి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారని గౌరీ నాయుడు తెలిపారు.  జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ తరపున సహకారాన్ని అందిస్తానని మంత్రి మనోహర్ హామీ ఇవ్వటం పట్ల గౌరీ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే పడాల అరుణ, రాష్ట్ర తూర్పు కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పాలవలస యశస్వినీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ), శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఆంధ్రప్రదేశ్ అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు – ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

*సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.*   *ఎర్ర బెలూన్లు ఎగరవేసి ప్రచారాన్ని ప్రారంభించిన* *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

TNR NEWS

నాపై కేసులన్నీ ఆరోపణలే – మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Dr Suneelkumar Yandra

సంక్రాంతి విశిష్టత ఏమిటి.. పెద్ద పండుగ ఎలా అయ్యింది !

Harish Hs

చిల్లపల్లి ఆధ్వర్యంలో పిఠాపురం.. జయకేతనం సభాప్రాంగణం వద్ద స్వచ్ఛభారత్

Dr Suneelkumar Yandra

మార్చి 3న భద్రాద్రి పాదయాత్ర రామాలయ విగ్రహా ప్రతిష్ట

Dr Suneelkumar Yandra