యువతీ యువకులు స్వయంకృషితో తమ కాళ్ళపై తాము నిలబడి నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించాలని టిపిసిసి డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కారింగుల అంజన్ గౌడ్ లు అన్నారు. కోదాడ పట్టణానికి చెందిన సిహెచ్ ఉపేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక అనంతగిరి రోడ్డు వివి రెడ్డి కాలేజీ ఎదురుగా మన కోదాడ సెలబ్రేషన్ నూతన థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత వారి కాళ్లపై వాళ్లు నిలబడి స్వయంకృషితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు అభివృద్ధితో పాటు నిరుద్యోగ యువతీ యువకులకు జీవన ఉపాధి కల్పించాలని తెలిపారు. అనంతరం థియేటర్లో ప్రదర్శించిన కార్యక్రమాన్ని తిలకించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు,కాంగ్రెస్ యువజన నాయకులు డేగ శ్రీధర్ , చల్లా కొండల్ రెడ్డి,ఎస్ కె ముస్తఫా , ధావన్,విశ్రాంత ఉపాధ్యాయులు మాతంగి ప్రభాకర్ రావు, పిడమర్తి వెంకటేశ్వర్లు, బంకా స్రవంతి, సిహెచ్ జానకి, తిరపయ్య, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

previous post