మోతే మండలం విబలాపురం గ్రామ పంచాయితీ పరిధిలోని నాగయ్య గూడెం గ్రామానికి చెందిన బోర్రాజు వెంకన్న, కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన గుండాల బయన్న నాయకత్వంలో వివిధ పార్టీలకు రాజీనామా చేసి 15 కుటుంబాలు సిపిఎం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మంగళవారం సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి నాగయ్య గూడెం గ్రామంలో సిపిఎం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోతే మండలంలో సిపిఎం పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాలకు ఆకర్షితులైన ప్రజలందరూ స్వచ్ఛందంగా సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలలో చేరడం అభినందనీయమన్నారు. బూర్జవా, భూస్వామ్య విధానాలు అనుసరిస్తున్న ఆయా పార్టీలకు రాజీనామా చేసి ప్రజా పోరాటాల రథసారథి సిపిఎం పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అనంతరం నాగయ్య గూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన సిపిఎం పార్టీ జెండా దిమ్మెను ఆయన ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు,సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎలిగి రెడ్డి వెంకట్ రెడ్డి, నాగం మల్లయ్య, కక్కిరేణి సత్యనారాయణ, కాంపాటి శ్రీను, కిన్నెర పోతయ్య, బూడిద లింగయ్య, సోమ గాని మల్లయ్య, దోసపాటి శ్రీను, జంపాల స్వరాజ్యం, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి వెలుగు మధు, నాయకులు చెరుకు శ్రీను, ఒగ్గు సైదులు, కోడి లింగయ్య, మేకల ఉపేందర్, గుండాల బయ్యన్న, బూడిగా పిచ్చయ్య,కాశ బోయిన రాములు, నిమ్మర బోయిన మాల్సుర్, చారి పాల్గొన్నారు.

previous post