December 8, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గుడ్ న్యూస్..త్వరలో పంచాయతీలకు పెండింగ్ బిల్లులు..!!

 

ఇప్పటికే రూ.750 కోట్లు క్లియర్ చేసిన ప్రభుత్వం గత సర్కారు హయాంలో రూ.1,200 కోట్లకుపైగా పెండింగ్

 

*బిల్లుల కోసం మాజీ సర్పంచుల ఒత్తిడి*

*దశల వారీగా క్లియర్ చేసేలా ప్రణాళిక*

 

గ్రామాల్లో జరిగిన పనులపై ఆరా

 

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయో సమగ్ర వివరాలు ఇవ్వాలని గతంలోనే పంచాయతీ రాజ్ శాఖ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీల వారీగా పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు పూర్తయ్యాయి వంటి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

 

ఇప్పటి వరకు గ్రామాల్లో చేపట్టిన పనుల్లో దాదాపు రూ.588 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నట్లు తేలింది. వీటిని దశల వారీగా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వివిధ పనులకు సంబంధించిన దాదాపు రూ.750 కోట్ల వరకు బిల్లులు చెల్లించారు. రాష్ట్రంలో 12,769 గ్రామాల్లో వీధిలైట్ల నిర్వహణ, మురుగు కాలువల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, మనఊరు- మనబడి, పల్లెప్రగతి, మిషన్ భగీరథ, పారిశుధ్యం తదితర కార్యక్రమాలు చేపట్టారు.

 

వీటికి సంబంధించి కొన్ని బిల్లులు పెండింగ్ ఉండడంతో మాజీ సర్పంచులు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు రూ.1,200 కోట్లకు పైగా పెండింగ్ ఉండగా.. దాదాపు రూ.750 కోట్ల వరకు కాంగ్రెస్ సర్కారు క్లియర్ చేసిందని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు సర్పంచులు.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోర్టుకు కూడా వెళ్లారు. అయితే, పంచాయతీ రాజ్శాఖ ఇప్పటికే గ్రామాల్లో మొత్తం పెండింగ్ బిల్లులు వివరాలు సేకరించినట్లు తెలిసింది. వాటిని దశలవారీగా క్లియర్ చేసేలా ప్రణాళికలు రూపొందించింది.

 

*రూ.4,181 కోట్లు దారి మళ్లించిన బీఆర్ఎస్ ప్రభుత్వం*

 

పదేండ్లలో స్థానిక సంస్థలకు గత ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులను రూ.10,170 కోట్లు కేటాయించింది. కానీ, అందులో రూ.5,988 కోట్లను మాత్రమే విడుదల చేయగా.. ఇందులో రూ. 4,181 కోట్లు దారి మళ్లించినట్లు సమాచారం. 42 శాతం నిధులను గ్రామ పంచాయతీలకు కేటాయించకుండా గత బీఆర్ఎస్ సర్కారు తన సొంత అవసరాలకు వాడుకున్నదని పలువురు మాజీ సర్పంచులు ఆరోపిస్తున్నారు.

Related posts

ప్రభుత్వ విజయాలు వివరించేందుకు కళాయాత్ర :   తెలంగాణ సాంస్కృతిక సారధి నర్సంపేట టీం లీడర్ నెల్లుట్ల సుమన్.

TNR NEWS

పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ‘కాట దంపతులు’

TNR NEWS

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

Harish Hs

ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి

TNR NEWS

అధునాతన టెక్నాలజీ తో ఏర్పాటు అభినందనీయం… అతిధి బేబీ ఫొటోస్టూడియో ప్రారంభించిన పాస్టర్ ప్రసంగి..  రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్

TNR NEWS

వావ్ ” సిద్దిపేట ట్యాంక్ బండ్… డెనోసార్ పార్క్.. సిద్దిపేట కోమటి చెరువు పర్యాటకను మెచ్చిన జర్మనీ పర్యాటక బృందం

TNR NEWS