కోదాడ నియోజక వర్గ అభివృద్ధి లో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లు రాజీ లేని కృషి చేస్తున్నారని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకట్ రత్నం బాబు అన్నారు. శని వారం కోదాడ మునిసిపల్ పరిధి లోని లక్ష్మీ పురం కాలనీ 1వ వార్డులో ఎమ్మెల్యే పద్మావతి తన నిధుల నుండి మంజూరు చేసిన 3లక్షల రూ. లతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.కోదాడ పట్టణం తో పాటు నియోజక వర్గం లో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లు రైతులకు సాగు నీటి కోసం, గ్రామాల్లో, పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీలు, మంచి నీరు, విద్యుత్ , పాఠశాల లు , అంగన్వాడీ ప్రభుత్వ కార్యాలయాల భవనాల కోసం వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయిస్తున్నారు. నేడు జిల్లా లో కోదాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అగ్ర స్థానం లో ఉందన్నారు. పనుల జాతర తో నియోజక వర్గం లోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. కోదాడ పట్టణం లో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే పద్మావతి దృష్టి కి తీసుకెళితే వెంటనే పరిష్కరిస్తున్నారన్నారు.కోదాడ ప్రజలు అభివృద్ధి లో భాగ స్వాములు కావాలన్నారు. ఈకార్య క్రమంలో నాయకులు రావెళ్ల కృష్ణా రావు, లైటింగ్ ప్రసాద్,మేకపోతుల సత్యనారాయణ, ముస్తఫా, నిజాం, కృష్ణ బాబు వీరబాబు, జానీ పగ్గిళ్ల వెంకన్న, రఫీ,లక్ష్మి బొబ్బమ్మ, పున్నమ్మ, అపరాజ్యం తదితరులు ఉన్నారు.
