స్వర్ణకారులు, వెండి బంగారం వ్యాపారస్తులపై పోలీసుల వేధింపులు సరైనది కాదు అని విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు కొండోజు నరసింహ చారి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని బులియన్ మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన విశ్వకర్మ చైతన్య సభలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్పొరేటు నగల షాపులు వచ్చి చిన్న వ్యాపారస్తులు స్వర్ణకారులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా తరుణంలో ఎప్పుడో బ్రిటిష్ వారు పెట్టిన చట్టాలతో దొంగ బంగారం రికవరీ పేరిట పోలీసులు స్వర్ణకారులను, వ్యాపారస్తులను వేధించడం మానుకోవాలి అన్నారు. చట్టాల్లో మార్పులు చేసి నిజంగా దొంగతనం చేసిన వ్యక్తి పట్టుబడితే అతని ఆస్తులు అమ్మి సొమ్ము రికవరీ చేయాలి లేనిపక్షంలో కఠిన శిక్షలు వేసి జీవితాంతం జైల్లో ఉంచాలి అన్నారు. అనంతరం స్వర్ణకారులు బులియన్ మర్చంట్ అసోసియేషన్ నాయకులు ఐక్యత వర్ధిల్లాలంటూ చేతిలో చెయ్యేసి ఐక్యత చాటుతూ నినాదాలు చేశారు. ఈ సమావేశంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు పోలోజు అంజి, బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు సుందరి వెంకటేశ్వర్లు, ఉప్పల శ్రీనివాసరావు, కోదాడ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు డాక్టర్ అనంతరపు బ్రహ్మం, కందుకూరి ప్రదీప్, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు……
previous post
next post