Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బిసి రిజర్వేషన్ల పెంపునకు 25న సత్యాగ్రహ దీక్ష

రానున్న స్థానిక

సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు బీసీ యువజన సంఘం కోదాడ నియోజకవర్గం అధ్యక్షులు గడ్డం లక్ష్మీనారాయణ యాదవ్ తెలిపారు. మునగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశపరిచి, బిసి రిజర్వేషన్ల అమలుకు ప్రత్యా మ్నాయ నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి, రాజ్యాంగంలోని 246 డి6 టి6 ప్రకారం స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లను పెంపునకు జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు..రాజకీయ పార్టీలు సిద్ధాంతపరమైన విభేదాలతో వాస్తవాలు మాట్లాడ కుండా రాజకీయ ఘర్షణ వైఖరితో కేంద్రాన్ని విమర్శిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఇది సరికాదన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రెండు బిసి బిల్లులు గవర్నర్ ఆమోదించడం కానీ, తిరస్కరించడం కానీ చేయలేదన్నారు. కోర్టులు కూడా బిసి రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఉన్నాయనే వాదన కూడా వినపడుతుందని, అలా అయితే, దీనిపై న్యాయ పోరాటం చేయాల్సిందేనన్నారు. 42శాతం బిసి రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్ని కలు నిర్వహించనిపక్షంలో యుద్ధం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అమరగాని వంశీ, మండవ వీరబాబు, రెస్ సైదులు బీసీ నాయకులూ తదితరులు పాల్గోన్నారు

 

Related posts

తపాలా శాఖ జీవిత బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి …. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

TNR NEWS

బాపూజీ గ్రంథాలయం ఎదుట బీఈడీ అభ్యర్థుల నిరసన

TNR NEWS

సిరికొండలో బోనం ఎత్తిన ఎమ్మెల్యే

Harish Hs

అన్ని బంధాల కన్నా స్నేహబంధం ఎంతో విలువైనది

Harish Hs