కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సోమవారం అనంతగిరి మండలం వాయలసింగారం గ్రామ సమీపంలో వరి నాట్లు వేస్తున్న వ్యవసాయ మహిళ కూలీలను ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యేను చూడగానే మహిళ కూలీలు సంతోషంతో ఆమె వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని, వారితో కలిసి ఫోటోలు దిగి ఆనందోత్సవాలను వ్యక్తం చేశారు.
