కోదాడ లోని యం యస్ జూనియర్ కళాశాల లో శుక్రవారం నాడు ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన యం యస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి సీ ఈ వో యస్ యస్ రావు లు మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకుంటున్నామని,తెలుగు వాడుక బాషా ఉద్యమ పితామహుడు ,గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి,నిత్య వ్యవహార భాషలో ఉన్న అందాన్ని తెలిపిన మహనీయుడు గిడుగు అని అన్నారు.గిడుగు ఉద్యమo వలన కొద్దిమందికో పరిమితమైన చదువు అందరికీ అందుబాటులో కి వచ్చిందన్నారు. మాతృభాషని మర్చిపోతే,మాతృమూర్తిని మర్చినట్లు అన్నారు. కార్యక్రమంలో యం యస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్,అధ్యాపకులు ఐనుద్దీన్, రహీం,విజయభాస్కర్,శ్రీనివాసరావు, గోపి,సునీత, మణి,వినీత,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

previous post