కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామానికి చెందిన కామ్రేడ్ కొండా అనసూర్యమ్మ మృతి బాధాకరమని కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అన్నారు కమ్యూనిస్టు పార్టీ కుటుంబానికి చెందిన కొండా అనసూర్యమ్మ శనివారం సాయంత్రం తన నివాస గృహములో మృతి చెందినది ఈ సందర్భంగా ఆదివారం మృతురాలి నివాస గృహానికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు వెళ్లి పార్థివ దేహం పై కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జండా కప్పి పూలమాలలతో ఘన నివాళులర్పించారు అనంతరం బత్తినేని హనుమంతరావు మాట్లాడుతూ కొండ అనసూర్యమ్మ కుటుంబం తమ్మర కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని వారి పూర్వికులు కాలం నుండి కమ్యూనిస్టు పార్టీలోనే ఉంటూ చివరి వరకు కమ్యూనిస్టు పార్టీ నమ్ముకొని జీవించారని గుర్తు చేశారు తమ్మర గ్రామపంచాయతీ ఎన్నికల్లో తన కోడలు కొండా వెంకటరమణ వార్డ్ నెంబర్ గా కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారని ఆయన గుర్తు చేశారు తను జీవించినంత కాలం కమ్యూనిస్టు భావాలకు కట్టుబడి నాయకులతో కలుపుకొని కమ్యూనిస్టుగా జీవించి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొల్లు ప్రసాదు ఏఐటీయూసీ ప్రాంతీయ నాయకులు పోతురాజు సత్యనారాయణ గ్రామ శాఖ కార్యదర్శి మాతంగి ప్రసాదు రాయపూడి కాటమరాజు , శ్రీను, కంబాల సైదులు కుటుంబ సభ్యులు కొండా వెంకటేశ్వర్లు కొండా జలయా కొండా కోటేశ్వరరావు కుమార్తెలు పాల్గొన్నారు

previous post