రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో కేద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి అన్నారు. సీపీఎం మద్దూరు ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతితులుగా హాజరై మాట్లాడుతూ నారాయణ పేట జిల్లా వ్యాప్తంగా పుస్కాలంగా వర్షాలు కురువడంతో రైతులు విస్తృతంగా వరి సాగు చేశారు.కానీ సరిపడా యూరియా పంపిణీ చేయకపోవడం వల్ల రైతులు రోజుల తరబడి ఫర్టిలైజర్ ల చుట్టూ రాత్రనక పగలనక లైన్ల లో నిల్చున్నప్పటికి దొరకడం లేదని అన్నారు. కేద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జిల్లాకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల రైతుంగాన్ని కూడగట్టి ఉద్యమిస్తామని అన్నారు.అనంతరం మద్దూరు ఏరియా కమిటీని ఎన్నుకున్నారు.
*సీపీఎం మద్దూరు ఏరియా కార్యదర్శిగా గోపాల్ ఎన్నిక*
మద్దూరు మండల కేంద్రం లో జరిగిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం లో మద్దూరు కోస్గి దామరగిద్ద మండల ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. గోపాల్ ఏరియా కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నుకోగా మరో పదిమంది కమిటీ సభ్యులు గా ఎన్నికయ్యారు.కార్యక్రమం లో అశోక్,అంజిలయ్య గౌడ్,అలీ,జోషి, శివకుమార్,హన్మంతు,రామక్రిష్ణ, లాలప్ప, అరుణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.