నారాయణపేట జిల్లా మద్దూర్ మండల తాసిల్దార్ కార్యాలయంలో మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కాడు. ఆర్ఐ అమర్ నాథ్‌రెడ్డి మద్దూరు మండలంలోని రేణి వట్ల గ్రామానికి చెందిన ఒక రైతుకు సంబంధించి ఐదు గుంటల పొలాన్ని పాస్ బుక్ లో ఎంట్రీ చేసేందుకు 5000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఆ రైతు ఎంత వేడుకున్న ఆర్ఐ వినకుండా డబ్బులు ఇస్తే గాని పని జరగదు అని తేల్చి చెప్పాడు. తప్పని పరిస్థితుల్లో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు సోమవారం పక్కా ప్రణాళికలతో మహబూబ్ నగర్ ఏసీబీ డిఎస్పి బాలకృష్ణ ఆధ్వర్యంలో వారి సిబ్బంది కలిసి లంచం డబ్బులను పట్టుకొని ఆర్ఐ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కార్యాలయములో మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

previous post