Tnrnews.in
తెలంగాణ

కోదాడ రామాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ రజిత రెడ్డి ప్రత్యేక పూజలు

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సిఐ రజిత రెడ్డి లు అన్నారు. బుధ వారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా కోదండ రామస్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు వారు ముఖ్య అతిథిలుగా హాజరై పూజలు నిర్వహించారు. అమ్మవారి కరుణ కటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల మధ్య మమతానునురాగాలు, పరోపకారం భావాలు పెరుగుతాయి అన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని తిరొక్క పూలతో పుష్పాలంకరణ చేసి అందంగా అలంకరించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. కాగా ఆలయానికి వచ్చిన భక్తులకు నాగు బండి. వీరయ్య, భద్రమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యర్ర. వెంకటనారాయణ జ్ఞాపకార్థం వేలాది మంది భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని రూరల్ సీఐ రజిత రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నాగు బండి రంగా, జ్యోతి, యర్ర భారతమ్మ, యర్ర. శ్రీనివాసరావు,జ్యోతి, చంద్రశేఖర్,అనూష,యర్ర వశిష్ట, గాయత్రి, విదిగ్న చారుహాసిని, పైడిమర్రి సత్తిబాబు, పైడిమర్రి. వెంకటనారాయణ, దేవాలయ కమిటీ సభ్యులు గరిడేపల్లి. లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు……….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఏపూరి తిరపమ్మ సుధీర్..

TNR NEWS

ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి.

Harish Hs

యోగా జీవితంలో ఒక భాగం కావాలి

Harish Hs

శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు 

TNR NEWS

ఎల్ ఓ సి అంద చేసిన జువ్వాడి కృష్ణారావు

TNR NEWS

రేపు తెలంగాణ బంద్‌కి పిలుపునిచ్చిన తీన్మార్ మల్లన్న

TNR NEWS