అర్హులైన వారందరికీ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అర్హులైన వారందరికీ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలి సోమవారం సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా మరియు సూర్యాపేట తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి గారు మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో మరియు రూరల్ మండలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన వారికి ఇవ్వకుండా ఉండడం వల్ల నిరుపయోగంగా ఉండటంవల్ల శిథిల వ్యవస్థకు మారుతున్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొరకు తవ్వి తీసిన రోడ్లు నిర్మించని కారణంగా రోడ్లు మొత్తం గుంతల మాయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు సూర్యాపేట పట్టణానికి శివారు ప్రాంతంలో నిర్మించిన కాలనీలో నిర్మించిన మంచినీటి ట్యాంకులలో నీటి సౌకర్యం కల్పించని కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతుందని అన్నారు సీజనల్ వ్యాధులతో ప్రజలు అనారోగ్యానికి గురి అవుతారు సకాలంలో వైద్య సౌకర్యం అందించడం లేదని ప్రభుత్వం విఫలం చెందిందన్నారు పట్టణంలో వీధి కుక్కలు కోతుల సమస్యలు తోటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పై సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనియెడల భవిష్యత్తులో సంబంధిత అధికారులను ముట్టడిస్తామని హెచ్చరించినారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు చెరుకు ఏకలక్ష్మి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్ కొప్పుల రజిత ఎలుగూరి గోవిందు మద్దెల జ్యోతి సిపిఎం టూ టౌన్ కార్యదర్శి పిండిగ నాగమణి సిపిఎం 3 టౌన్ కార్యదర్శి చిట్లింకి యాదగిరి రూరల్ మండల కార్యదర్శి మే రెడ్డి కృష్ణారెడ్డి మండల కమిటీ సభ్యులు మేకనబోయిన సైదమ్మ మందడి రామ్ రెడ్డి నాగిరెడ్డి శేఖర్ రెడ్డి పందిరి సత్యనారాయణరెడ్డి బోళ్ల నాగేందర్ రెడ్డి కామల్ల లింగయ్య నారాయణ వీరారెడ్డి నల్ల మేకల అంజయ్య జనగాం సత్తయ్య చెరుకు సత్యం తీగల లింగయ్య శీను తదితరులు పాల్గొన్నారు

previous post
next post