కోదాడ పశువుల సంతలో రైతులకు ఇబ్బంది లేకుండా మార్కెట్ యాడ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. మంగళవారం పశువుల సంతను పరిశీలించిన ఆమె, పశువులను విక్రయించడానికి కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే సహకారంతో రానున్న రోజుల్లో సంతను మరింత అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు.
