Tnrnews.in
తెలంగాణవిద్య

విద్యార్థులకు సైబర్ నేరాల పై అవగాహన

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో,కోదాడ షీ టీం ఎస్సై మాధురి మునగాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో షీటీమ్స్, సైబర్ నేరాలపై విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సందర్భంగా షీ టీం ఎస్సై మాధురి మాట్లాడుతూ…సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారి అధ్వర్యంలో షీ టీమ్స్,సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు.ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,ఏటీఎం కార్డ్ వివరాలు, ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు.మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు.వ్యక్తిగత సమాచారం,బ్యాంకు వివరాలు,ఏటీఎం పిన్ నెంబర్లు,సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డిపి లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు.యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు.

యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. పుట్టిన తేదీలను,ఫోన్ నెంబర్లను పాస్వర్డ్ గా పెట్టుకోవద్దు అని సూచించారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ సునీత రాణి,మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి,విద్యార్థినిలు మరియు ఉపాధ్యాయునిలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సింగర్ రాజు ఎందరికో స్ఫూర్తి…సజ్జనార్ 

TNR NEWS

పబ్లిక్ క్లబ్ అభివృద్ధికి కృషి పబ్లిక్ క్లబ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ భూమి పూజ

TNR NEWS

అభివృద్ధి లో జిల్లా లో కోదాడ అగ్ర స్థానం

Harish Hs

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు -వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్డ రాజు

TNR NEWS

గజ్వేల్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

TNR NEWS

మునగాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ తో పాటు సిబ్బందిని ఏర్పాటు చేయాలి

TNR NEWS