సూర్యాపేట టౌన్: సూర్యాపేట పట్టణంలో ఉన్న96 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన పేదలందరికీ పంపిణీ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారు సూర్యాపేట పట్టణంలోని96 డబల్ బెడ్ రూమ్ ఇల్లు మిగిలి ఉన్నాయని వాటిని అరలే నా పేదలందరికీ పంపిణీ చేయాలని కోరారు. సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో కొత్తగా వేసిన రోడ్లన్నీ సైతం వదలకుండా ఇస్తానుసారం రోడ్లను పగలగొట్టి పైపులు వేసిన గుప్తాదారులు దానిపై కొత్త రోడ్డు వేయకుండా వెళ్లిపోయారని అన్నారు. తక్షణమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో పగలగొట్టిన రోడ్లను పునర్నిర్మాణం చేయాలన్నారు. 9వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ప్రభుత్వం అర్హులైన వారందరికీ పింఛన్ మంజూరు చేయాలన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, షేక్ జాంగిర్, మామిడి సుందరయ్య, షేక్ సైదులు, పిట్టల రాణి, మల్లయ్య, జానకి రాములు, వట్టె ఎర్రయ్య, కప్పల సత్యం, బుద్ధ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post