నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అనారోగ్యంతో బాధపడినప్పుడు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రాయపోల్ మండల పరిధిలోని టెంకంపేట గ్రామానికి చెందిన తిరుపతి కోటేష్ రూ.38 వేలు, పెద్దోళ్ల రమేష్ రూ.19,500 వేల సీఎం సహాయనిది చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం ప్రగతి బాటలో నడిచినట్లని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు అనారోగ్యానికి గురైై ప్రాణాలను పోగొట్టుకోవద్దన్న సంకల్పంతో వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఆదుకోవడం కోసం సీఎం సహాయనిధి చెక్కులు అందజేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా సరే అనారోగ్యానికి గురైనప్పుడు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టెంకంపేట మాజీ సర్పంచ్ తిరుపతి నర్సింలు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బాల్ రెడ్డి, తిరుపతి కోటేష్, పెద్దోల్ల రమేష్, పెద్దోల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.