సూర్యాపేట జిల్లా కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయనున్న టపాసుల దుకాణాలకు గాను భానుపురి క్రాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షులుగా పిడమర్తి మధు, గౌరవ సలహాదారులుగా పాలవరపు రాజేష్,ధార పూర్ణచందర్, ఉపాధ్యక్షులుగా జన్నపాల రాహుల్, కార్యదర్శిగా పోలోజు వినయ్, సహయ కార్యదర్శిగా మాచర్ల ఉపేందర్, కోశాధికారిగా శిల్ప అజయ్, సహాయ కోశాధికారిగా కోసూరి సందీప్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు పిడమర్తి మధు మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఎప్పటి మాదిరిగానే అధికారులు చెప్పిన స్థలంలో నిబంధనలకు లోబడి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు నిర్ణయించుకున్నామన్నారు. అధికారులు సూచించిన స్థలంలో కాకుండా బయట ఎవరైనా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తే అధికారులు తగిన చర్యలు తీసుకొని తమకు సహకరించాలని కోరారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు టపాసులను అధికారులు నిర్ణయించిన స్థలంలో ఏర్పాటు చేసిన దుకాణదారుల వద్దనే కొనుగోలు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.