కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం చిన్న కోడఫ్గల్ లో కొత్తగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ..రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సహకార సంఘాల బలోపేతమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం నిజాంసాగర్ మండలం మాగీ గ్రామంలో రైతు శిక్షణ కేంద్రం, సమావేశ గదితో పాటు కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఏక కాలంలో రుణ మాఫీ చేయడం అసాధ్యమని గత ప్రభుత్వం చెప్పిన అంశాన్ని సుసాధ్యం చేసిన ప్రజా ప్రభుత్వం ఇది అని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమం లో సొసైటీ ఛైర్మన్ నాగిరెడ్డి,మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్,మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ సాయిరెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, ఆదిల్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.