కోదాడ పట్టణంలో ఇటీవల అనుమానస్పదంగా మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని జాతీయ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు భైరపాక జయకర్, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు వీరదాసు వెంకటరత్నం మాదిగ, లాయర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏర్పుల వీరేష్ కుమార్ పరామర్శించారు. కర్ల రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజేష్ తల్లి లలితతో మాట్లాడి రాజేష్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో కర్ల రాజేష్ మృతిపట్ల రాజేష్ కుటుంబ సభ్యులతో వివరాలను అడిగి తెలుసుకున్నామని, రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు మాదిగ లాయర్స్ అందరూ రాజేష్ కుటుంబానికి అండగా నిలిచి వారి తరఫున న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలిపారు. రాజేష్ మృతికి కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగ లాయర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి డప్పు మల్లయ్య, దావీదు, మోష, విశ్వనాధ్, కాశెట్టి కుమార్, సిద్దు, మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు ఏపూరి రాజు మాదిగ, యలమర్తి రాము మాదిగ, కొండపల్లి ఆంజనేయులు,వడ్డేపల్లి కోటేష్, ఏపూరి సత్యరాజు,కుక్కల కృష్ణ , బచ్చలకూరి వెంకన్న, మేరిగా రామారావు, సోమపంగు సురేష్, జంగంపల్లి శ్రీను, పాముల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
