December 8, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.*

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్స్ రోడ్డున పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ,స్కాలర్షిప్స్ లను వెంటనే విడుదల చేయాలని 100 మంది విద్యార్థులతో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది…

ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ,

4 సంవత్సరాలుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించడం లేదన్నారు.ఏడాదికి నాలుగు లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని వీరికి ఏడాదికి మూడు వేల కోట్లు అవసరమౌవుతాయి అని తెలిపారు.2019 నుంచి ఇప్పటివరకు బకాయిలు పేరుకుపోయాయన్నారు.

మొత్తంగా కలిపి రూ.8214.57 కోట్లు ఫీజు బకాయిలు పెండింగ్ లో ఉన్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం అనుసరించిన విద్యార్థి వ్యతిరేక విధానాలు,ప్రజా వ్యతిరేక విధానాలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్న కూడా ఇప్పటివరకు ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంe ప్రభుత్వపు చేతగానితనానికి నిదర్శనమన్నారు.రాష్ట్రంలో 80శాతం మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి విద్యను కొనసాగిస్తుంటే ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు అందించాల్సిన స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం వలన విద్యా పూర్తయిన విద్యార్థులు పై చదువుల కోసం సర్టిఫికెట్స్ కొరకు కళాశాలలకు వెళితే కళాశాల యాజమాన్యం మీకు రావలసిన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రానందువలన మీరు ఫీజు చెల్లించి మీ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని ఆంక్షలు పెట్టడంతో విద్యార్థులు & తల్లిదండ్రులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారాన్నరు.ఇలాంటి సందర్భాలు విద్యార్థులకు ఎదురవ్వడం కారణంగా విద్యార్థులు సర్టిఫికెట్ తీసుకోలేక,తమ పై చదువులను కొనసాగించలేక రోజువారి కూలీలుగా,క్యాటరింగ్ బాయ్స్ గా తదితర పనుల కోసం వెళ్లాల్సి వస్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను స్పందించి తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిల మొత్తాన్ని విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టాలని పి.డి.ఎస్.యు గా డిమాండ్ చేశారు.లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

  • ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు కాలేజీ విద్యార్థులు, మమత, సంధ్య, నవ్య, శైలజ, వనజ, శివ, సందీప్,మహేష్,నవీను,వినయ్, వేణు,సాయిరాం, ఉదయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా కార్తీక సోమవారం పూజలు

TNR NEWS

బిజెపి కేంద్ర మంత్రులను కలిసిన జిల్లా నాయకులు.

TNR NEWS

సింగర్ రాజు ఎందరికో స్ఫూర్తి…సజ్జనార్ 

TNR NEWS

గ్యార్మి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి 

TNR NEWS

మహాత్మ జ్యోతిరావు పూలే134వవర్ధంతి

TNR NEWS

విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం  బహుజన సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి కత్తి నాగబాబు

TNR NEWS