తణుకు : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా సద్గురువర్యులు బుధవారం తణుకు మండలం పైడిపర్రు గ్రామములో గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ శాఖనందు యం.బి.యం మల్టీస్పెషాలిటీ హోమియో క్లినిక్ యొక్క 8వ శాఖను ప్రారంభం చేసారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ తణుకు పట్టణ మరియు పరిసరప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే సంకల్పంతో ఇప్పుడు పైడిపర్రు గ్రామంలో యం.బి.యం మల్టీస్పెషాలిటీ హోమియో క్లినిక్ ను ప్రారంభించారాని, ఈ క్లినిక్ నందు నిష్ణాతులైన హోమియో వైద్య నిపుణులచే అతి తక్కువ ఖర్చుతో హోమియోపతి వైద్య సేవలు అందిచబడతాయని, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భముగా యం.బి.యం మల్టీస్పెషాలిటీ హోమియో క్లినిక్ చీఫ్ కన్సల్టెంట్ ప్రొఫెసర్. డా పింగళి ఆనంద కుమార్ మాట్లాడుతూ క్లిష్టమైన మరియు దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతి వైద్య విధానము ద్వారా చికిత్స అందించవచ్చు అని అన్నారు. స్పెషాలిటీ క్లినిక్స్ ద్వారా క్యాన్సర్, సంతాన సాఫల్యం, ఆటోఇమ్మ్యూన్ వ్యాధులు, ఆటిజం వంటి వ్యాధులకు హోమియోపతి వైద్య విధానం ద్వారా వైద్యం అందించబడుతుందని అన్నారు. పిల్లల వైద్య నిపుణులైన డా పుల్లా ఉమా మహేశ్వరి మాట్లాడుతూ తాను ఆటిజం వ్యాధి పై విస్తృత పరిశోధన చేశారని, వారి పర్యవేక్షణలో ఆటిజం, ఏడిహెచ్డి, పిల్లలలో ప్రవర్తన లోపాలు మరియు అన్ని రకములైన చిన్నపిల్లల వ్యాధులకు చికిత్స అందించబడుతుందన్నారు. ఈ కార్యాక్రమంలో ఏ.ఎస్.ఆర్ సంస్థల డైరెక్టర్ పోలిశెట్టి శ్రీనివాస్, ఏ.ఎస్.ఆర్ బి.ఈ.డి కళాశాల ప్రిన్సిపాల్ డా శ్యామ్ బాబు, జనసేన నాయకులు మారిశెట్టి మురళి, పీఠం సభ్యులు పాల్గొన్నారు.
